Breaking News

APCM

జగన్​ అండతోనే దళితులపై దాడులు

సారథిన్యూస్​, విశాఖపట్టణం: సీఎం జగన్మోహన్​రెడ్డి అండతోనే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితులపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్​ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళితుడి భూఆక్రమణను ఖండించారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్​ ఉదాసీన వైఖరితోనే దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి […]

Read More

‘గిడుగు’ సేవలు అజరామరం

సారథిన్యూస్​, అమరావతి: పండితులు, కొన్నివర్గాలకే పరిమితమైన తెలుగుభాషను గిడుగు రామ్మూర్తి పంతులు సరళతరం చేశారని.. ఆయన సేవలను తెలుగుజాతి ఎప్పటికీ మరువబోదని ఏపీ సీఎం వైఎస్​ జగన్మోహన్​రెడ్డి కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్​ ట్వీట్​ చేశారు. గిడుగు రామ్మూర్తి గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషనను వ్యవహారికభాషలోకి మార్చిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. యువత గిడుగు రామ్మూర్తి పంతులు గురించి […]

Read More

బాబు కుట్రలను తిప్పికొడతాం

విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్​ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్​బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్​ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్​లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్​కు రావాలని సవాల్​ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్​​ జగన్​మోహన్​రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. […]

Read More

‘రాజధాని వివాదం’ కేంద్రం క్లారిటీ

ఢిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత నిచ్చింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని.. అది కేంద్రం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల నేపథ్యంలో దోనే సాంబశివరావు అనే […]

Read More

జగన్.. ప్రజాబాట

సారథి న్యూస్, అనంతపురం: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు సచివాలయ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. జులై 8న దివంగత సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీచేసి ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలోకి […]

Read More

అక్రమ మద్యంపై ఉక్కుపాదం

సారథి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో అక్రమమద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం వైఎస్​ జగన్మోహన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు సకాలంలో సేవలందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వలంటీర్లపై కఠినచర్యలు తీసుకుంటామని.. వారికి అపరాధ రుసుము వేసే విషయంపై అధికారులతో […]

Read More