సారథి, సిద్దిపేట: అధైర్యపడొద్దు అండగా ఉంటామని బుధవారం బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, హుస్నాబాద్ టౌన్ ఇంచార్జి నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో చికిత్స పోందుతున్న పలువురి కుటుంబాల్లో మనోధైర్యం నింపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలోని 8వ వార్డు సభ్యులు […]
సారథి, హుస్నాబాద్: గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారమివ్వాలని అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి జ్యోతిష్యం చెబుతామని కొందరు దొంగ స్వామిజీలు వస్తున్నారని, ప్రజల కటుంబ జీవన స్థితిగతులను తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైబర్ నేరగాళ్లు పలు ప్రభుత్వ రంగ సంస్థ ఆఫీసర్లమని గ్రామాల్లోని రైతులు, సామాన్య ప్రజల బ్యాంక్ అకౌంట్, ఏటీఎం, ఆధార్, పాన్ కార్డు, సెల్ ఫోన్ లో వచ్చే ఓటీపీ చెప్పాలని నమ్మించి బ్యాంకుల్లోని డబ్బులు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: దివ్యాంగులైన ఇద్దరు దంపతులకు ఓ పోలీసు అధికారి తన సొంతఖర్చులతో మరుదొడ్లను కట్టించి మానవతా హృదయం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొజ్జ సంతోష, భర్త కొమురయ్య దంపతులు దివ్యాంగులు. వారి ఆలాన పాలన చూసుకోవడానికి సంతానం కూడా లేకపోవడంతో ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ దంపతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. వారి ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయిన అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా వైరస్ ను అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ హుస్నాబాద్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. సోమవారం అక్కన్నపేట హెల్త్‌సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, పోలీసులు అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నవారికి కోవిడ్-19 టెస్టులు చేయాలన్నారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. బిజెపి నాయకులు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కళ్యాణ్, సాయిరాం పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. మంగళవారం కట్కూర్ గ్రామంలో మోడీ పాలనపై ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్తీక్, రాహుల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప […]