Breaking News

AJAY

ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు

ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్​ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]

Read More

ఖమ్మంలో యాంటీజెన్​ టెస్టులు

సారథిన్యూస్​, ఖమ్మం: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రాపిడ్​ యాంటిజెన్​ టెస్టులు చేస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్​ ఖమ్మంలో ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్టుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ ఆర్వీ […]

Read More

ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ

కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నయం చేసుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు హోంఐసోలేషన్​ కిట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్కుల ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, మేయర్​ పాపాలాల్​, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్​పర్సన్​ లింగాల […]

Read More
రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి అజయ్​

రైతు వేదికలు దేశానికే తలమానికం

సారథిన్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే తలమానికమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు, వారికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్​ రైతువేదికలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల […]

Read More

పీవీ.. గొప్ప రాజనీతిజ్ఞుడు

సారథి న్యూస్​, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్​లో మంత్రి పువ్వాడ అజయ్​, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్​లో […]

Read More

అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం పాపకొల్లులో శుక్రవారం ఆయన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు.. రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం […]

Read More

ఊరూరా హరితపండుగ

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్​, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్​ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్​ హెడ్​ కార్టర్స్​లో ఎస్పీ సునీల్​ దత్​ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ […]

Read More

సొంత నిధులతో రైతు వేదిక

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా రైతు వేదిక నిర్మిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణపనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ రైతు వేదికను మంత్రి అజయ్​ రూ.40 లక్షలు సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, ఎమ్మెల్సీ బాలసాని, రైతుబంధు జిల్లా కన్వీనర్​ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎమ్సీ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Read More