Breaking News

TELANGANA

సార్లు.. ఎంతసేపు ఎదురుచూడాలె!

సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడా ఎమ్మెల్యేలు, లీడర్లు వచ్చే వరకు పంపిణీ ప్రారంభించడం లేదు. దీంతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చీరల పంపిణీ చేపట్టారు. ఉదయం 10గంటలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉండగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మధ్యాహ్నం 12 గంటలైనా రాక పోవటంతో పంపిణీ కార్యక్రమం ఆలస్యమైంది. దీంతో మహిళలు […]

Read More

మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం

సారథిన్యూస్​, రామడుగు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలంగాణ సైకాలజిస్ట్​ అసోషియేషన్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగులో ఆన్​లైన్​ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా ప్రపంచాన్నివణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అయిలయ్య, రేష్మ, శివ కుమార్, ఆర్ సుధాకర్ రావు, […]

Read More

హథ్రాస్​ నిందితులను ఉరి తీయాలి

సారథి న్యూస్, రామడుగు: మనీషా వాల్మికిపై లైంగికదాడి జరిపిన నిందితులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రాస్​ జిల్లాలో మనీషా పై నలుగురు దుండగులు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని స్థానిక అంబేద్కర్​ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్​ నాయకులు మనీష చిత్రపటంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్​ మండల అధ్యక్షుడు తడగొండ శంకర్ […]

Read More

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

సారథి న్యూస్, రామాయంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్​ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలో చోటుచేసుకున్నది. కల్వకుంటకు చెందిన బుర్రని బాలమల్లు (45) రెండెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. ఇందుకోసం కొంత అప్పుచేశాడు. అయితే ఇటీవల కరిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలమల్లుకు భార్య ఇందిర తీవ్రంగా విలపిస్తున్నది. ఈ ఘటనపై కేసు […]

Read More

అందరికీ ఓటుహక్కు ఉండొద్దు..!

సారథి మీడియా, హైదరాబాద్​: అర్జున్​రెడ్డి ఫేం విజయ్​దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అందరికీ ఓటుహక్కు ఉండొద్దు. లిక్కర్​ మందు తీసుకొని ఓటేసేవారికి అస్సలు ఉండొద్దు. ధనవంతులకు, నిరుపేదలకు కూడా ఓటుహక్కు ఉండొద్దు. కేవలం మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఓటువేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకొనే హక్కుఉండాలి’ అంటూ సంచలన కామెంట్స్​ చేశాడు. ప్రస్తుతం విజయ్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రౌడీ హీరోగా యూత్​లో మంచి ఫాలోయింగ్​ ఉన్న విజయ్ దేవరకొండకు వ్యాఖ్యలపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం విజయ్.. పూరీ […]

Read More
దసరా కానుకగా తీరొక్క చీరలు

దసరా కానుకగా తీరొక్క చీరలు

సారథి న్యూస్, ములుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఏడాది మంచి డిజైన్లు, నాణ్యత పరంగా మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది 287 డిజైన్లతో చీరలను తయారు చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో 85వేల మంది, రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అమ్మవార్లు […]

Read More
ఇంటింటా బతుకమ్మ జరుపుకోవాలి

ఇంటింటా సంతోషంగా నిండాలని..

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్‌ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]

Read More