Breaking News

TELANGANA

కెప్టెన్ హరీశ్​ రావు .. ఫోర్లే ఫోర్లు

కెప్టెన్ హరీశ్​ రావు .. ఫోర్లే ఫోర్లు

సిద్దిపేట: నిన్నటి దాకా హైదరాబాద్​ మహానగర ఎన్నికల హడావుడిలో ఉన్న మంత్రి టి.హరీశ్​రావు ఆటవిడుపుగా సిద్దిపేటలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో బ్యాట్​ పట్టి కొద్దిసేపు అలరించారు. బుధవారం జరిగిన మ్యాచ్​లో సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగారు. అయితే తన టీమ్ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీశ్​ రావు క్రీజ్​లోకి దిగారు. దిగడంతో బంతిని బౌండరీ లైన్​ వైపునకు బాదుతూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ సునాయాసంగా […]

Read More
ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​హాజరు

ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​ హాజరు

సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, […]

Read More
బ్యాలెట్​బాక్స్​ల్లో భవితవ్యం

బ్యాలెట్​ బాక్స్​ల్లో భవితవ్యం

ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్​ కొన్నిచోట్ల రీపోలింగ్.. 4న ఓట్ల కౌంటింగ్ సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్​ ఎన్నికల వార్ ​ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా..నేనా? అనే రీతిలో తలపడిన పోరులో విజయం ఎవరిని వరించనుందో ఈనెల 4వ తేదీన కౌంటింగ్​లో తేలనుంది. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, పలుచోట్ల ఘర్షణలతో అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి 150 మంది, బీజేపీ […]

Read More
నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం

నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం […]

Read More
చివరి రోజు.. హోరాహోరీ

చివరి రోజు.. హోరాహోరీ

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్​ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరిరోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాటిగడ్డ చౌరస్తా, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. టీఆర్ఎస్​ప్రభుత్వం ఈ ఆరేళ్లలో […]

Read More
భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ

భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ

సారథి న్యూస్​, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. వ్యాక్సిన్ ​తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి వివరించగా.. వారి కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19ను అరికట్టేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని సైంటిస్టులు తనకు వివరించారని ప్రధాని మోడీ ట్వీట్​చేశారు. అంతకుముందు మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. […]

Read More

పుష్కరుడి చెంతకు భక్తజనం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సన్నిధిలోని పుష్కర ఘాట్ కు భక్త జనసందోహం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రోజు ఐదో రోజుకు పుష్కరాలు చేరాయి. తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించి జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వరుణుడిని దర్శించుకున్నారు. సుమారు 15వేల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మాననపాడు మండలం పుల్లూరు గ్రామశివారులోని తుంగభద్ర నది తీరాన ఏర్పాటుచేసిన […]

Read More
ప్రజలకు శాస్త్రీయమైన వ్యాక్సిన్

ప్రజలకు శాస్త్రీయమైన వ్యాక్సిన్

హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ […]

Read More