Breaking News

CARONA

ఐశ్వర్య ఆమె కూతురు డిశ్చార్జి

కరోనాను జయించిన ఐష్, ఆరాధ్య​

ముంబై: మాజీ మిస్​ వరల్డ్​ ఐశ్వర్యా రాయ్​ బచ్చన్​, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాను జయించారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబంలో జ‌యాబ‌చ్చ‌న్ మిన‌హా మిగిలిన కుటుంబస‌భ్యులు అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డ్డారు. కాగా వీరంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేశారు. ఈ మేరకు సోమవారం అభిషేక్​ బచ్చన్​ ట్వీట్​ చేశారు. ‘మేము కోలుకోవాలని కాంక్షిస్తూ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయి’ […]

Read More
జూలై 30నుంచి లాక్​డౌన్​

జూలై​ 30నుంచి లాక్​డౌన్​

సారథి న్యూస్​, నల్లగొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ వ్యాపారస్తులతో తన క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జులై 30 నుంచి 14 తేదీ వరకు వ్యాపారస్తులు నల్గొండలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 1 గంటవరకు తెరిచి ఉంచుతారని, ఇంకా మెడికల్ షాపులు, హాస్పిటళ్లు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయించడం జరిగిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశంలో చెప్పారు. కరోనా […]

Read More
జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకుంటున్నాం

337 మంది జర్నలిస్టులకు సాయం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ 337 మంది జర్నలిస్టులకు రూ. 59 లక్షల 30 వేల రూపాయలు ఆర్థికసాయం అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన 256 మందికి 20 వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందిచామన్నారు. జర్నలిస్టులు ఎవరికైనా […]

Read More
తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

తెలంగాణలో కరోనాతో 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 55,532 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 471 మంది మృత్యువాతపడ్డారు. చికిత్స అనంతరం 42,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,955కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 506 నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 168, వరంగల్​ అర్బన్​111, […]

Read More
కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More
ఒకే రోజు 50 వేల కేసులు

ఒకేరోజు 50వేల కేసులు

ఢిల్లీ : మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 49,931 కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే 13లక్షల నుంచి కేసుల సంఖ్య 14 లక్షలకు చేరింది. కాగా, దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 32,771 కు పెరిగింది. ఇప్పటివరకు 9,17,567 మందికి రోనా నయం కాగా, ప్రస్తుతం 4,85,114 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

Read More
సిక్కింలో తొలి కరోనా మృతి

సిక్కింలో కరోనా తొలి మరణం

సిక్కిం: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో తొలి కరోనా మరణం సంభవించింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఒదిగి ఉన్న చిన్నరాష్ట్రమైన సిక్కింలో కరోనా కేసులు కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో 140 మంది కోలుకొని డిశ్చార్జ్​ అయ్యారు. కాగా సిక్కింలో శనివారం ఓ వ్యక్తి కరోనాతో చికిత్స పొంది మృతిచెందాడు. అతడికి మధుమేహం, హైబీపీ ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read More
ఆరుబయటే అసెంబ్లీ

కరోనా ఎఫెక్ట్​.. ఆరుబయటే అసెంబ్లీ

పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు. జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు […]

Read More