‘మద్దతు’ దక్కేదాకా పోరాటం బీజేపీకి ఓటు వేయొద్దు టీఆర్ఎస్వైఖరి సరిగ్గా లేదు తెలంగాణ రైతులను ఆదుకోవాలి ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల ధర్నా కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: ప్రతి పంటకు కనీస మద్దతుధర కల్పించేలా చట్టం తేవాలని కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటు వేయొద్దని, […]
జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి ఘటన సీసీ పుటేజ్‌ఆధారంగా కేసులు: సీఐ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, బుధవారం మరో 22మందిపై కేసులు నమోదు […]
నల్లగొండలో టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన గులాబీ, కమలం శ్రేణుల బాహాబాహీ ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి ధాన్యం కుప్పలపై పరుగులు.. చెల్లాచెదురైన వడ్లు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌కు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘బండి సంజయ్ […]
సామాజిక సారథి, భువనగిరి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కలెక్టరేట్ల ముందు ధర్నాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రోడ్లపై ధర్నాలు చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెంలో ఏర్పాటుచేసిన ‘బహుజన మేలుకొలుపు’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం […]
సామాజిక సారథి, రామడుగు: ఎస్సీలతో బీసీలు, మైనార్టీలకు కూడా దళితబంధు మాదిరిగానే ప్రత్యేక పథకం అమలు చేయాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల బీజేపీ నాయకులు కోరారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దూలం కళ్యాణ్, మేకల లక్ష్మణ్, బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు తీర్మాలపూర్ ఎంపీటీసీ మోడీ రవీందర్ తదితరులు బీసీబంధు దరఖాస్తు ఫారాన్ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలను […]
సారథి, నర్సాపూర్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్ కే దక్కిందని, ఆయన మాటలు ఎవరూ నమ్మరని మెదక్‌జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సింగయపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బీజేవైఎం నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ […]
సారథి, రామడుగు: మండల కేంద్రంలోని స్థానిక ఆర్య వైశ్య భవనంలో బీజేపీ రామడుగు మండల శాఖ కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పార్టీ సంస్థగత నిర్మాణంపై చర్చించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ఇన్చార్జ్ రాపర్తి ప్రసాద్, కృష్టారెడ్డి, జిన్నారం విద్యాసాగర్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సారథి,పెద్దశంకరంపేట: దళితులను బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ దళిత సర్పంచ్ మహేశ్వరి నరేష్‌ను ఎమ్మెల్యే రఘునందన్ రావు అవమానించడం, దళితుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్‌కు చెప్పకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.