ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్ కొన్నిచోట్ల రీపోలింగ్.. 4న ఓట్ల కౌంటింగ్ సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వార్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా..నేనా? అనే రీతిలో తలపడిన పోరులో విజయం ఎవరిని వరించనుందో ఈనెల 4వ తేదీన కౌంటింగ్‌లో తేలనుంది. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, పలుచోట్ల ఘర్షణలతో అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర ఏం చేస్తోందని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతి లేదన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆరేండ్ల మూడు నెలల పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే పెరిగి చదువుకున్నానని.. ఎర్రమంజిల్‌లో ఉంటూ జలమండలి ఆఫీసు […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని 110డివిజన్లలో గెలుపు తమదేనని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్ నుంచి మొదలు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ దుర్మార్గం గా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్ లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇన్చార్జ్ సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ […]
డిసెంబర్ 1న మహానగర ఎన్నికలు మేయర్స్థానం జనరల్ మహిళకు కేటాయింపు 150 వార్డులు.. 9,238 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీపాస్ బీ పాస్ వెబ్ సైట్ ను రూపొందించామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివరించారు. సోమవారం ఆయన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. 600 […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, కార్మికులకు 50శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తక్షణమే రూ.120కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తాను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని స్పష్టంచేశారు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీకి నష్టం.. కార్మికులకు ఉద్యోగ […]
బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్ నీట మునిగిందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]