సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల చైనా సైనికుల దాడిలో అసువులు బాసిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్–1 కేడర్)గా నియమిస్తూ తెలంగాణ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నం.80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె నెలరోజుల్లో సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీఓ ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270 […]
మన అప్పులు రూ.3లక్షల కోట్లు ఏడాదికి వడ్డీ రూ.15వేల కోట్లు పేరుకుపోతున్న బకాయిలు సర్దుబాటుకు ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు ఇప్పటికే బాండ్ల విక్రయంతో రూ.14వేల కోట్ల సమీకరణ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రం అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయే నాటికి (2 జూన్, 2014) తెలంగాణ వాటాగా రూ.60వేల కోట్ల అప్పు మన మీద పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరేండ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లపై చిలుకు అప్పులను […]
న్యూఢిల్లీ: కలకత్తాలో 2001లో తాము సాధించిన చారిత్రాత్మక విజయానికి దేశమంతా సంబురాలు చేసుకుందని హైదరాబాద్ స్టార్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. కానీ తమకే సంబురాలకు సమయం సరిపోలేదన్నాడు. ‘కలకత్తా మ్యాచ్ తర్వాత వెంటనే మూడవ టెస్ట్ కోసం చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆ విజయాన్ని మేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. దీంతో ఆస్వాదించడానికి పెద్దగా సమయం దొరకలేదు. కాకపోతే ఈ విజయంతో దేశం మొత్తం సంబురాలు చేసుకుందని మాత్రం అనుకున్నాం. టీమ్‌లో ప్రతిఒక్కరూ తమ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యారు. మహమ్మారి బారినపడి నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 191 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,406కి చేరింది. 3,027 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రసుత్తం 2,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్ 13, కరీంనగర్ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ అయ్యాయి. […]
‘జనతా గ్యారేజ్’ పాటకు స్టెప్పులు న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టిక్ టాక్ వీడియోచేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు.. భార్య క్యాండీస్ తో కలిసి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘మేం ప్రయత్నించాం. కానీ మీ డాన్స్ చాలా స్పీడ్ గా ఉంది’ అని వార్నర్ మెసేజ్ రాశాడు. ఈ వీడియోను సన్ […]
అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు మరింత వేగవంతంగా ముందుకెళ్లాలని మంత్రి కె.తారక రామారావు సూచించారు. శనివారం బుద్దభవన్ లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టాల్సిన పనుల ప్రగతిపై సమీక్షించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ […]
చిన్నపిల్లల డాక్టర్‌గా విశేష గుర్తింపు. సారథి న్యూస్, హైదరాబాద్ : నిలోఫర్‌ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్లోళ్ల సుదర్శన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఉస్మానియా మెడికల్ కాజీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. నిలోఫర్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ పనిచేసి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఖైరతాబాద్ లో క్రిష్ణ చిల్డ్రన్స్ క్లీనిక్ ను కొనసాగిస్తూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో కూడా ఆయన సేవలందించారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస […]