Breaking News

హరితహారం

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత

సారథిన్యూస్​, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నిగిడాల సురేశ్​, ఎస్​ఐ గుత్తా వెంకట్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్, సతీశ్​, రాము, షకీల్, కిరణ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
హరితహారం సక్సెస్​ కావాలి

హరితహారం సక్సెస్​ కావాలి

సారథి న్యూస్, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్​బాడీ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో హరితహారం విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను నాటి ట్రీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు […]

Read More

పెంటకుప్పలపై.. హరితహారం మొక్కలు

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుతున్నదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. హుస్నాబాద్​ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్​ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో 4000 వేలకు పైగా హరితహారం మొక్కలు పెంటకుప్పలపై వేశారని ఆరోపించారు. మండల ప్రజాపరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్​కు ఆ మొక్కలు చూపించగా ఆ మొక్కలు ప్రభుత్వానికి కావంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు. రూ.5లక్షలకు […]

Read More
ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్​, నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నెపర్తి శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాటిల్ మొక్కలు నాటారు. వాతావరణంలో సమతుల్యం లోపించడంతోనే వర్షాలు కురవడం లేదని మంత్రి జగదీశ్వర్​రెడ్డి అన్నారు.

Read More

ఊరూరా హరితపండుగ

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్​, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్​ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్​ హెడ్​ కార్టర్స్​లో ఎస్పీ సునీల్​ దత్​ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ […]

Read More
6వ హరితహారంలో 30 కోట్ల మొక్కలు

6వ హరితహారంలో 30 కోట్ల మొక్కలు

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి) : ప్రభుత్వం మొక్కలు నాటే మహాయజ్ఞంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు తెలిపారు. గురువారం తెలంగాణకు హరితహారం 6వ విడతలో భాగంగా సైదాబాద్ డివిజన్, ఎల్ఐసీ కాలనీ లోని వివేకానంద పార్క్ లో దేవీప్రసాద్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో […]

Read More

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె.తారక రామారావు సనత్ నగర్ నియోజవర్గం బల్కంపేట శ్మశానవాటికలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్​పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గంలోని దుండిగల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ […]

Read More

హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ

సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటి ప్రారంభించారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్,వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Read More