సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కరోనా నివారణ చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం రోగులు, వైద్యసిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలకు ప్రతినెలా రూ.350 కోట్లు, ఒక్కో కరోనా పేషెంట్భోజనానికి ఒకరోజుకు రూ.500 చొప్పున […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పట్టాల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా అమలుచేయాలని కర్నూలు మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ స్పష్టంచేశారు. సోమవారం ఆన్ లైన్ విధానంలో లబ్ధిదారులకు లేఅవుట్ స్థలాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద మొత్తం […]
సారథి న్యూస్, కర్నూలు: రక్షాబంధన్ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆయన మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ సోదరిసోదరుల బంధాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భారతి, సుమలత, లలితమ్మ పాల్గొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: పోరాటం.. ఆందోళన.. ఉద్యమానికి తోడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉక్కు సంకల్పంతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారని ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ పునరుద్ఘాటించారు. న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, పరిపాన కేంద్రంగా విశాఖపట్నంను ప్రకటించినందుకు శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో పటాకులు కాల్చారు. కళాకారులు డప్పు దరువులు, కోలాటం […]
అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్)పై ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచింది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం సంతకం చేశారు. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన […]
జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీ ప్యాపిలిలో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. రెండు గంటలపాటు కొనసాగిన మీటింగ్‌లో పలు కీలకమైన అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చించింది. అందుకోసం జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]
పేదలకు న్యాయం చేద్దాం ఇళ్లపట్టాల పంపిణీ పనులు కంప్లీట్ చేయండి వీడియోకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇసుక రీచ్‌ల్లోకి చేరుతోంది. పది రోజుల్లో స్టాక్‌యార్డులో ఉంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలని, అందుకోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై […]