పేదలకు న్యాయం చేద్దాం ఇళ్లపట్టాల పంపిణీ పనులు కంప్లీట్ చేయండి వీడియోకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇసుక రీచ్‌ల్లోకి చేరుతోంది. పది రోజుల్లో స్టాక్‌యార్డులో ఉంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలని, అందుకోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోదఫా 2020–21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించింది. మంగళవారం అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శానసమండలిలో డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లుగా ప్రకటించారు. బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయించాయి. వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,419.44 […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: మొదటి ఏడాదిలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 90 శాతం వరకు పూర్తి చేశామని, ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే ఆలోచనతో ఈ సదస్సులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ‘మన పాలన, మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా తొలిరోజు ‘ప్రజా పాలన – సంక్షేమం’పై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నుంచి […]
ఆర్థిక వ్యవస్థను ప్రారంభించుకుందాం ఇది కీలకమైన సమయం జాగ్రత్తగా ఉందాం కరోనా నివారణలో అద్భుతంగా పనిచేశారు ప్రజల్లో మరింత చైతన్యం కలిగించండి కలెక్టర్, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సారథి న్యూస్, అనంతపురం: ‘నేను ప్రతిసారీ చెబుతన్నా.. నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారీగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెబుతున్నా.. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పనిచేస్తే.. ప్రభుత్వం బాగా […]