Breaking News

సీఎం కేసీఆర్

రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్ల సాయం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల(జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు.. […]

Read More
సిటీలో ఫ్రీగా తాగునీటి సరఫరా

సిటీలో ఫ్రీగా తాగునీటి సరఫరా

సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. 20వేల లీటర్ల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా నీటిని సరఫరా చేసే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. శనివారం ప్రగతిభవన్ లో మంత్రి కె.తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20వేల […]

Read More
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సారథి న్యూస్, రామాయంపేట: సబ్బండవర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి గ్రామంలో వందశాతం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో గురువారం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కలసి చేపపిల్లలను చెరువులో వదిలారు. సోమాజి చెరువులో 73,500 చేపపిల్లలు, బ్రాహ్మండ్ల చెరువులో 93వేల చేప పిల్లలను వదిలినట్లు […]

Read More
ప్రజలకు లంచాలిచ్చే పనిపెట్టొద్దు

ఎవరికీ లంచాలిచ్చే పనిపెట్టొద్దు

అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండేలా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ‘వ్యవసాయేతర ఆస్తులు.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేన్ కు అనుసరించాల్సిన పద్ధతులపై’ ఆదివారం ప్రగతి […]

Read More
నిరుద్యోగులకు సీఎం తీపికబురు

నిరుద్యోగులకు సీఎం తీపికబురు

సారథి న్యూస్, హైదరాబాద్​: సీఎం కె.చంద్రశేఖర్​రావు నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల మేర ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తీచేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్​మెంట్​ జరగాల్సి […]

Read More
వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్​రావు ముఖ్య​అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read More
సిద్దిపేటలో కేసీఆర్​నగర్​

సిద్దిపేటలో కేసీఆర్​ నగర్​

సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ […]

Read More
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నల్లచట్టాలు

కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నల్లచట్టాలు

సారథి న్యూస్, మానవపాడు: నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులకు దోచిపెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్​బంద్​కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బెంగళూరు– హైదరాబాద్ హైవేను అఖిలపక్ష నాయకులతో కలిసి దిగ్బంధించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన మొండిబకాయిలను రద్దుచేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో […]

Read More