Breaking News

సర్పంచ్

వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి

సర్పంచ్​ బిల్లులు స్వాహా

సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అస​లు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి […]

Read More
సర్వేను పరిశీలించిన సర్పంచ్

సర్వేను పరిశీలించిన సర్పంచ్

– రేణికుంటలో ఇంటింటి సర్వే… గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సర్పంచి సారథి, కరీంనగర్ ప్రతినిధి: లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని రేణికుంట సర్పంచి బొయిని కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శక్రవారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ఎవ్వరికైన కొవిడ్ సింటమ్స్ అయిన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా […]

Read More
గెలుపోటములు మైదానంలో ప్రారంభం

జీవితంలో గెలవాలి

– క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత సారథి, సిద్దిపేట ప్రతినిధి: గెలుపు ఓటమిలు మైదానంలో ప్రారంభమవుతాయని రేణికుంట గ్రామ సర్పంచి, సర్పంచుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొయిని కొమురయ్య అన్నారు. బుధవారం గుండ్లపల్లి సర్పంచి బెతెల్లి సమత రాజేందర్ రెడ్డి తండ్రి బెతెల్లి రాంరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా క్రికెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ క్రీడకారులు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆత్మస్థైర్యం, పట్టుదల పెరుగుతోందన్నారు. […]

Read More
గ్రామదేవతలకు జలాభిషేకం

గ్రామదేవతలకు జలాభిషేకం

సారథి న్యూస్, హుస్నాబాద్: వర్షాలు కురవాలని గ్రామస్తులు, రైతులు బుధవారం మండలంలోని మాలపల్లిలో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. సర్పంచ్ బత్తల మల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు పెట్టి రోజులు దాటినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకంతో పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఆంజనేయస్వామి విగ్రహాలకు జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Read More
కళ్లకల్ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ […]

Read More

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్, బెజ్జంకి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆమె తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ పోచయ్య, సర్పంచ్ సీతా లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఎంపీటీసీ మల్లేశంగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More