సారథి న్యూస్, హైదరాబాద్: కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మతపెద్దలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమావేశమయ్యారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ […]
గుట్టలుగా పేరుకుపోతున్న ఫైల్స్ తిరిగి తిరిగి వేసారిపోతున్న బాధితులు సారథి న్యూస్, హైదరాబాద్: పెండింగ్.. పెండింగ్.. పెండింగ్.. పలు కీలకమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారిని అడిగినా ఇప్పుడు వారి నోటి నుంచి వస్తున్న మాట ఇదే. తాత్కాలిక సచివాలయం(బీఆర్కే భవన్) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (మెట్రో రైల్ భవన్, బేగంపేట) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరం, అనివార్యమైతే తప్ప మిగతా దస్త్రాలను ముట్టకోని పరిస్థితి నెలకొంది. దీంతో మూడు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘కరోనా కట్టడి కోసం మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.475 కోట్లను ఖర్చుచేసింది..’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల అధికారికంగా చేసిన ప్రకటన ఇది. కానీ ఇంతకు మించి నూతన సచివాలయ నిర్మాణం కోసం సర్కారు ఏకంగా రూ.500 కోట్లను కేటాయించడం గమనార్హం. ఏడాది కాలంలో దీన్ని పూర్తిచేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంచనాలు రూ.వెయ్యి కోట్ల దాకా ఎగబాకే అవకాశాలు లేకపోలేదని ఆర్థికశాఖ అంచనా. దీన్నిబట్టి కరోనా నివారణ, […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న 704 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయొచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్ తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను తప్పు పట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లితుందని కాంగ్రెస్ కోర్టుకు వెళ్లారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డకోకుడదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.