Breaking News

వెల్దండ

సర్పంచ్​బర్త్​డే.. విద్యార్థులకు విలువైన గిఫ్టులు

సర్పంచ్​ బర్త్​డే.. విద్యార్థులకు విలువైన గిఫ్టులు

సామాజిక సారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామ సర్పంచ్ దార్ల కుమార్​ జన్మదిన వేడుకలను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు విలువైన ఆట వస్తువులు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read More
ఎస్సై నర్సింహులుపై బురద చల్లొద్దు

ఎస్సై నర్సింహులుపై బురద చల్లొద్దు

సామాజిక సారథి, వెల్దండ: పోలీస్ ​స్టేషన్​కు వచ్చిన ఓ వ్యక్తిపై నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు చేయి చేసుకున్నారనే ప్రచారం సరికాదని అఖిలపక్ష నేతలు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి పట్ల కొంచెం గట్టిగా మాట్లాడారని తెలిపారు. ఎస్సై నర్సింహులు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాల ప్రజల పట్ల సౌమ్యంగా ఉంటారని తెలిపారు. సమస్య ఎలాంటిదైనా, ఎవరు స్టేషన్​కు వెళ్లినా చాలా సావధానంగా వింటూ పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనపై బురద చల్లే ప్రయత్నంలో కొందరు […]

Read More
యువనేత గొప్పసాయం

యువనేత గొప్పసాయం

సామాజిక సారథి, వెల్దండ: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నేనున్నానని మానవతను చూపించారు ఓ యువనేత. చేసింది చిన్నసాయమే అయినా గొప్ప మనస్సును చాటుకున్నారు. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ముంగల్​శెట్టి రాములు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబసభ్యులు చాలా ఖర్చుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఎర్రగడ్డ చెస్ట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు నిమ్స్​లో వైద్యం తీసుకున్నాడు. ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి.. అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్​యువనాయకుడు, బాలాజీ ట్రస్ట్ […]

Read More
కారు డ్రైవరా.. మజాకా!

కారు డ్రైవరా.. మజాకా!

బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్​ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్​ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్​స్పీడ్​తో వస్తున్న కారు మొదట బైక్​ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]

Read More
నష్టపరిహారం ఇప్పించండి సారూ..!

నష్టపరిహారం ఇప్పించండి సారూ..!

సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలో నష్టపోయిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములుకు బాధిత రైతు బొక్కల శ్రీను వినతిపత్రం అందజేశాడు. మంగళవారం వెల్దండకు వచ్చిన ఆయనకు సదరు రైతు కలిసి సమస్యలను వినతిపత్రంలో విన్నవించాడు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూనష్టపరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు.

Read More
అలరించిన ‘పార్వతి కల్యాణం’ నాటకం

అలరించిన పార్వతి కల్యాణం నాటకం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకుని మూడురోజులుగా స్థానిక భజన బృందం కళాకారులు ఆడిన పార్వతి కల్యాణం పౌరాణిక నాటకం అలరించింది. ప్రేక్షకులు జేజేలు పలికారు. హైటెక్​యుగంలోనూ కళలను బతికిస్తున్న కళాబృందాన్ని పలువురు అభినందించారు. జానపద, పౌరాణిక నాటకరంగ ఇతివృత్తం, సారాంశాన్ని నేటి తరానికి అందించాలని కోరారు. కళ ప్రజల కోసం, మంచి కోసం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. నాటకంలో తారాకాసురుడిగా కొప్పు వెంకటయ్య, […]

Read More
వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్​ డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి ​చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్​డౌన్​ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్​ 19 […]

Read More
కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఉత్తమ సర్పంచ్​ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ ​డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ ​పి.వెంకటేశ్వర్​ రావు తెలిపారు. ఈ అవార్డు […]

Read More