Breaking News

వర్షం

5రోజులు విస్తారంగా వర్షాలు

5రోజులు విస్తారంగా వర్షాలు

సారథి న్యూస్​ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుముల‌తో కూడిన భారీ […]

Read More
ఉస్మానియా.. బురద.. బురద

ఉస్మానియా.. బురద.. బురద

సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు హైదరాబాద్​లోని ఉస్మానియా జనరల్​ ఆస్పత్రి పాత బిల్డింగ్​లోకి వరద నీరు వచ్చిచేరింది. వార్డుల్లోకి వర్షపు నీరంతా చేరడంతో చికిత్స పొందుతున్న రోగులంతా తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, ఆపరేషన్​చేయించుకున్న మహిళలు ఎక్కడికి వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఆస్పత్రి సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తోడివేయాల్సి వచ్చింది. ఈ ఘటన కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Read More

ఆశలు చిగురించే

సారథి న్యూస్, మెదక్: తొలకరి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో మృగశిర కార్తె ఆరంభం నుంచే వానలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆశలు చిగురించాయి. సకాలంలో చినుకు పలకరించి నేలతల్లి మెత్తబడడంతో రైతులు వానాకాలం పంట సాగుకు ఉపక్రమించారు. దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. […]

Read More
తెలంగాణకు వర్షసూచన

తెలంగాణకు వర్షసూచన

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని వెల్లడించారు. పశ్చిమ విదర్భ, దాని పరిసరాల్లో కిలోమీటర్ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, మరోవైపు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని తెలిపారు.

Read More

సిటీలో వర్షం

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, మారేడ్‌పల్లి, జేబీఎస్‌, బేగంపేట, లంగర్‌హౌస్‌, గోల్కొండ, టోలీచౌకి, కార్వాన్‌, మెహిదీపట్నం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, షాపూర్‌నగర్‌, కూకట్‌పల్లి, కొంపల్లి, సుచిత్ర, చింతల్‌, దుండిగల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, గండిపేట్‌, కిస్మత్‌పూర్‌, బండ్లగూడ జాగీర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ నిలిచిన ప్రాంతాల్లో […]

Read More