సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]
సారథి న్యూస్, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్‌ఐఏ కేసులను […]
సారథిన్యూస్, హైదరాబాద్: విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]
సారథిన్యూస్, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, […]