Breaking News

మెదక్

నిరుపేద వధువు పెండ్లికి సాయం

నిరుపేద వధువు పెండ్లికి సాయం

సారథి న్యూస్, రామాయంపేట: రామాయంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల వివాహానికి మెదక్​జిల్లా నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పుస్తెమట్టెలను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్​ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, అబ్దుల్, ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More
ఎన్ని ఇబ్బందులొచ్చినా పథకాలను ఆపబోం..

ఎన్ని ఇబ్బందులొచ్చినా పథకాలను కొనసాగిస్తాం

సారథి న్యూస్, మెదక్: టీఆర్ఎస్ ​ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాలకు సంబంధించిన 35 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని […]

Read More
 ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]

Read More
ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ […]

Read More
రైతులకు రూ.51కోట్ల ధాన్యం చెల్లింపులు

రైతులకు రూ.51కోట్ల ధాన్యం చెల్లింపులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 16,971 మంది రైతుల నుంచి 51,746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.51కోట్లను వారి ఖాతాలో జమచేశామని మెదక్​ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం ధాన్యాన్ని కూడా కొని మిల్లులకు తరలిస్తున్నామని, ఇందులో ఎలాంటి ఇబ్బందుల్లేవని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కూడా ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో […]

Read More
చివరి గింజ దాకా కొంటాం

చివరి గింజ దాకా కొంటాం

సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్​జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]

Read More
వైభవంగా భవానీ మాత పల్లకీసేవ

వైభవంగా భవానీ మాత పల్లకీసేవ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి భవానీ మాత పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ఊరేగిస్తూ.. స్థానిక భవానీ మాత మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ముందుకుసాగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్​ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.

Read More