ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6.875 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,30,599 కి చేరింది. తాజాగా 219 మందిని కరోనా పొట్టనపెట్టకోగా.. మొత్తం మరణాల సంఖ్య 9,667కు చేరింది. కాగా 1,27, 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వెల్లడించారు.
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరోనా ఉధృతిని అంచనా వేయనున్నది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో తిరిగి కరోనాకు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కరోనా టెస్టులు, వైద్యం తదితర అంశాలను పరిశీలించనున్నది.
ముంబై: గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఐదురోజుల్లో చైనా మన దేశంలో 40,300 సైబర్ ఎటాక్స్ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ శాతం ఎటాక్స్ అన్నీ బ్యాంకింగ్, ఐటీ సెక్టార్‌పైనే జరిగాయని మహారాష్ట్ర సైబర్ వింగ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశశ్వి యాదవ్ అన్నారు. మహారాష్ట్ర సైబర్ వింగ్, స్టేట్ పోలీస్ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ శాతం సైబర్ ఎటాక్స్ అన్నీ చైనాలోని చెంగ్డూ ఏరియా నుంచి జరిగాయని తెలుస్తోంది. […]
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్ రెస్పాన్స్ ప్లాన్‌ను అధికారులు రివైజ్ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య 11వేలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. 311 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 9,195కు చేరిందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుతం మన దేశం నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఆ తర్వాత స్థానాల్లో […]
ముంబై: మన దేశంలోనే అత్యధిక కేసుల నమోదైన మహారాష్ట్రలో కరోనా బారినపడిన వారు ఎక్కువగా 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారేనని ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటా ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,01,141 కేసులు నమోదు కాగా.. వారిలో 97,407 మందిపై స్టడీ చేసింది. వారిలో 19,523 (20.04%) మంది 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారే అని, వాళ్లంతా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే అని చెప్పింది. […]
ముంబై: మహారాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. జితేంద్ర అవధ్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్) కరోనా బారినపడగా తాజాగా, సామాజిక న్యాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేకు కరోనా వైరస్ ప్రబలింది. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలినా వైరస్ లక్షణాలు మాత్రం ఆయనలో లేవని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. రెండు రోజుల క్రితం ధనుంజయ్ ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. దీంతో ఆయనతో కలిసి […]
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల్లో వ్యాప్తి మరింత ఎక్కువైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య మూడులక్షలకు చేరడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా బీట్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్ సమావేశాల్లో […]