ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుండా బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన […]
నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య తీర్చిన ఘనత కేసీఆర్ దే విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ […]
సారథి, సిద్దిపేట: ప్రజా నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. గురువారం మంత్రి జన్మదిన వేడుకలను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ […]
భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రి తుల్సీ సిలావత్, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని పలువురు అధికారులు, పోలీస్ సిబ్బందికి కూడా […]
చంఢీగర్: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్ మంత్రి రాజిందర్ సింగ్ బజ్వాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]
కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నయం చేసుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు హోంఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్కుల ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ లింగాల […]
సారథిన్యూస్, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్‌రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]