సారథి న్యూస్, హైదరాబాద్: ఎల్‌బీ నగర్ సర్కిల్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్హైదరాబాద్వాసుల ట్రాఫిక్కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఎస్సార్‌డీపీ ఫేజ్-1 ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని ఈ నిర్మాణంలో […]
సారథి న్యూస్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో 99శాతం మంది కరోనా రోగులు రికవరీ అవుతున్నారని మంత్రి కె.తారకరామారావు అన్నారు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కోవిడ్–19 ఐసీయూ సెంటర్, 40 పడకల ఆక్సిజన్ వార్డుతో పాటు కోవిడ్ అంబులెన్స్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రికి సీఎస్ఆర్ పథకం కింద రూ.2.28 కోట్లు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ రోగాల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు మంత్రి కె.తారక రామారావు కోరారు. ప్రైవేట్ఆస్పత్రి వల్ల తాను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన అనురెడ్డి రాదేశ్అనే యువకుడు గురువారం ట్విట్టర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు. ‘కోవిడ్ – 19 కారణంగా నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. […]
సారథి న్యూస్, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని 8 డివిజన్లలో తాగునీటి సరఫరా పైప్ లైన్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.41కోట్లు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభిపూర్రాజు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: లాక్ డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్ ధర తగ్గించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హౌసింగ్‌శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. గురువారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత ఇచ్చేందుకు ధర తగ్గించాల్సిన అవసరం ఉందని సిమెంట్ కంపెనీ ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పారు. 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.230 బస్తా ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు మరో మూడేళ్ల పాటు డబుల్ బెడ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: నగర నడిబొడ్డున పంజాగుట్టలో రూ.23కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆదివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లాక్డౌన్ తో కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులు, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ను […]