యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్ల సాయం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల(జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు.. […]
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరిరోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాటిగడ్డ చౌరస్తా, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. టీఆర్ఎస్ప్రభుత్వం ఈ ఆరేళ్లలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆరేండ్ల మూడు నెలల పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే పెరిగి చదువుకున్నానని.. ఎర్రమంజిల్‌లో ఉంటూ జలమండలి ఆఫీసు […]
సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీపాస్ బీ పాస్ వెబ్ సైట్ ను రూపొందించామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివరించారు. సోమవారం ఆయన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. 600 […]
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్పుట్ సబ్సిడీకి […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు మంగళవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఐదు సవరణలు చేసిన బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.ఐదు సవరణలు ఇవే1.మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేషన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఈజ్ఆఫ్ డూయింగ్బిజినెస్కు మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని జలమండలిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సివిల్ సప్లయీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సీసీఎల్ఏ వంటి పలు శాఖలపై వివరాలు అందజేసి చేపట్టాల్సిన సంస్కరణలపై ఆయా సెక్రటరీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. టీఎస్ బీపాస్ సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని మిలియన్ ప్లస్ నగరాల కేటగిరీలో ఉన్న హైదరాబాద్ కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.421కోట్లు కేటాయించిందని, వీటిని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల […]