సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్‌కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్సమావేశ మందిరంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ జి.వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, జేసీ3(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ.. తమిళనాడు, సమైక్యాంధ్ర రాష్ట్రాలకు తొలి సీఎంగా ఎన్నికై […]