సామాజిక సారథి, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సారథి న్యూస్, పాలకొండ: పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలకొండ, వీరఘట్టం, రేగిడి ఆమదాలవలస మండలం, సచివాలయంలో ఉన్న ఉమెన్స్ ప్రొడక్షన్ (మహిళా పోలీసులు) తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ పీఎం శ్రావణి మాట్లాడుతూ.. నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రజలతో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.శంకర్రావు, పాలకొండ ఎస్సై ఆర్ జనార్దన్ రావు, వీరఘట్టం మండలం […]
సారథిన్యూస్, రామగుండం: నాటుసారాను తయారుచేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గుడాంబా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండలం కొలనూరు చెరువు సమీపంలో గుడుంబా స్థావరాలపై దాడులు జరిపి గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన ఆరువందల లీటర్ల బెల్లం పానకం, 50 కిలోల బెల్లం, నాటుసారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ […]
సారథి న్యూస్, నర్సాపూర్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న నాటుసారాను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ పంచాయతీకి చెందిన కొందరు గిరిజనులు విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అసిస్టెంట్ సూపర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10లీటర్ల నాటుసారా, 100 కేజీల నానబెట్టిన బెల్లం, బెల్లం ఊటను పారబోశారు. నాటుసారాను అమ్మినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠినచర్యలు తీసుకుంటామని మాట్లాడుతూ చెప్పారు. ఆయన […]