సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర పుష్కరాలకు కార్తీక శోభ సంతరించుకుంది. పవిత్ర సోమవారం కావడం, పుష్కరాలు 11వ రోజు కావడంతో పలు ఘాట్లకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండల పరిధిలోని పుల్లూరు పుష్కర ఘాట్ కు తాకిడి పెరిగింది. ఇక్కడ వేలసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలోని ఘాట్లలో నదీస్నానాలకు అనుమతి లేకపోవడంతో అలంపూర్ పుష్కర ఘాట్ కు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. కొందరు నదిలో […]
సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు పుష్కర ఘాట్ భక్తుల తాకిడితో పులకరించింది. పుష్కరాలు ఆదివారానికి పదిరోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఓ వైపు తుఫాన్.. మరోవైపు కరోనా ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. పుల్లూరులో ఉన్న శివాలయం, కాలభైరవుడు సూర్యనారాయణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు.పుల్లూరు సర్పంచ్ నారాయణమ్మ తన కుటుంబసభ్యులతో ఆదివారం పుష్కర […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సన్నిధిలోని పుష్కర ఘాట్ కు భక్త జనసందోహం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రోజు ఐదో రోజుకు పుష్కరాలు చేరాయి. తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించి జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వరుణుడిని దర్శించుకున్నారు. సుమారు 15వేల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మాననపాడు మండలం పుల్లూరు గ్రామశివారులోని తుంగభద్ర నది తీరాన ఏర్పాటుచేసిన […]
సారథి న్యూస్, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రాజోలిలోని పుల్లూరు, అయిజ మండలం వేణిసోంపురం ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ స్నానాలు చేసిన అనంతరం అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. :: ఫొటోలు, సాధిక్, మానవపాడు
సారథి న్యూస్, శ్రీకాకుళం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన పంచారామాలకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డీఎం వరలక్ష్మి తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పరిష్కారాల దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్ చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ శృతిఓజా, ఎస్పీ రంజన్‌రతన్ కుమార్‌తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]
నవంబర్ 20 నుంచి ‘తుంగభద్ర’ పుష్కరాలు కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సారథి న్యూస్, కర్నూలు, మంత్రాలయం: ఈ ఏడాది నవంబర్20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే తుంగభద్ర నది పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కౌతాళం మండలం మేలిగనూరు పుష్కర్‌ఘాట్–1, మంత్రాయంలోని కాచాపురం పుష్కర ఘాట్–2, రామలింగేశ్వర స్వామి దేవాయం రాంపురం పుష్కర […]