చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు 10న వసంత్‌కుమార్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ సంతాపం తెలిపారు. వసంత్‌కుమార్ మృతి కాంగ్రెస్ తీరని […]
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ నటుడు, మాస్ హీరో, అక్కడి ప్రేక్షకులతో తళపతిగా పిలిపించుకునే విజయ్ రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్ సొంతంగా ఓ రాజకీయపార్టీని స్థాపించి ఎన్నకలబరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తండ్రి, ప్రముఖదర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగారని సమాచారం. త్వరలోనే రాజకీయపార్టీని రిజిస్టర్ చేయుంచనున్నట్టు […]
దేశంలో 21రోజుల్లోనే రెట్టింపైన కోవిడ్ కేసులు 24గంటల్లో కొత్త కేసులు 62వేలు, 886 మరణాలు భారత్‌లో 41వేలు దాటిన కరోనా మరణాలు ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒక్క రోజు నమోదవడం భారత్‌లో ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం […]
చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్‌గా […]
చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ భన్వరిలాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్‌భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్‌ను కాంటాక్ట్ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీ.. సంప్రదాయ రాజకీయాలను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తోంది. తమిళనాడులో పాగా వేసేందుకు చిరకాల కోరిక తీర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే తమిళ తలైవా.. రజనీకాంత్‌ను తన అండదండలు ఉంటాయని ప్రకటించింది. కానీ.. రజనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొదలైందట. అక్కడ పార్టీ పెట్టిన […]