Breaking News

జోగుళాంబ గద్వాల

తుంగభద్రలో యువకుడి డెడ్​బాడీ లభ్యం

తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు ​డెడ్​బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ​ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు దాటుతున్నారు. మార్గమధ్యంలో పుట్టి మునిగిపోవడంతో […]

Read More
అత్యాశే..‘పుట్టి’ ముంచింది

అత్యాశే..‘పుట్టి’ ముంచింది

తుంగభద్ర నదిలో యువకుడు గల్లంతు అర్ధరాత్రి మద్యం తరలిస్తుండగా ఘటన గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): రోజుకు రూ.ఐదారు వేలు వస్తున్నాయనే అత్యాశే ఓ యువకుడి కొంపముంచింది. చీకటిమాటుగా సాగిస్తున్న దందా ప్రాణం మీదకు తెచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో ఆదివారం అర్ధరాత్రి పుట్టి ద్వారా నదిని దాటుతుండగా ప్రవాహంలో పుట్టి మునిగిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా […]

Read More
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

నడిగడ్డలో భారీ వర్షాలు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): నడిగడ్డలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వేసిన పంటలన్నీ నీట మునిగిపోతున్నాయి. వందల ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ తదితర పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉండవెల్లి మండలం పొంగూరు వాగు ఉధృతి కారణంగా సుమారు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్పంచ్ శ్రీలత భాస్కర్ […]

Read More
కదలినయ్​.. ప్రగతిరథ చక్రాలు​

కదలినయ్​.. ప్రగతిరథ చక్రాలు​

సారథి న్యూస్​, మెదక్, చేవెళ్ల​: కరోనా(కోవిడ్ –19) వ్యాప్తి నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. బయటికి కదిలాయి. ప్రభుత్వం కంటైన్​ మెంట్ ఏరియాలు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్ లుగా ప్రకటించడంతో ప్రజారవాణా మొదలైంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి […]

Read More
నడిగడ్డలో కరోనా కలకలం

నడిగడ్డలో కరోనా కలకలం

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల: నడిగడ్డకు కరోనా కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గురువారం వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 42 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 10 పాజిటివ్​ కేసులు నమోదుకావడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోనే ఏడు కేసులు నమోదయ్యాయి. ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ముగోనిపల్లి గ్రామంలో ముగ్గురు, గద్వాల టౌన్ లో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

Read More

అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై కట్టడి ఎక్కువ చేశారు.  జోగుళాంబ గద్వాల రెడ్ జోన్ గా ఉన్నందున అక్కడి నుంచి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత మండలాలకు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే కేసులు పెడతామని ఆత్మకూరు సీ​ఐ సీతయ్య హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టు వద్ద గేటు తాళాలు విరగ్గొట్టి ఆత్మకూరు అమరచింత మండలం రాత్రిపూట అక్రమంగా వస్తున్నారని దీనిపై నిఘా ఉంచి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని […]

Read More

కల్లు విక్రయాలపై దాడులు

సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాఅలంపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయించడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఆదివారం దాడులు జరిపి వాటిని నేలపాలుచేశారు. కల్లు విక్రయదారులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్ మధన్ మోహన్ తెలిపారు.

Read More