Breaking News

జర్నలిస్టు

అనారోగ్యంతో జర్నలిస్టు​ మృతి

సారథి న్యూస్​, కర్నూలు: వివిధ పత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేసిన అక్కలదేవి రాజా(30) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్​తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన రాజా.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికల్లో సబ్​ఎడిటర్​గా పనిచేశారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో ఇక్కడి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో రాజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే రాజా తమ […]

Read More

కరోనాకు జర్నలిస్టు బలి

సారథిన్యూస్ రామగుండం: కరోనా మహమ్మారి ఓ యువ జర్నలిస్టును బలి తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్​ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్​ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశాడు. రాంచందర్​ మృతికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More
కరోనా పాజిటివ్‌ .. జర్నలిస్ట్‌ సూసైడ్​

కరోనా పాజిటివ్‌.. జర్నలిస్ట్‌ సూసైడ్​

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్‌ బిల్డింగ్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హిందీ డైలీ ‘డైనిక్‌ భాస్కర్‌‌’ పేపర్‌‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆయన రెండు రోజుల నుంచి కొలీగ్స్‌, ఫ్రెండ్స్‌కు డిప్రెషన్‌ మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. జర్నిలిస్టులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, చాలా సార్లు […]

Read More

మనోజ్​కు ఘన నివాళి

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా బారినపడి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మనోజ్​కుమార్​ మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వట్టికొండ రవి, లక్ష్మణ్ నరసింహారావు, రాజేష్, మోటమర్రి రామకృష్ణ, మహమ్మద్ షఫీ, ప్రభాకర్ రెడ్డి, […]

Read More