టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ కొరత ఉండకూడదని భవిష్యత్ కార్యాచరణతో ఈ ప్లాంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో […]
ఢిల్లీ: విపక్షాల ఆరోపణలు, కోర్టు వ్యతిరేక తీర్పులు, అమరావతి ఉద్యమం ఇవేవీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. భారీమెజార్టీతో అధికారం చేపట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమపథకాలను ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అనేక జీవోలను కోర్టు రద్దుచేసింది కూడా. అయినప్పటికీ ప్రజల్లో జగన్‌పై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే. ఈ సర్వేలో […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ సహా అన్ని రకాల ఎంట్రెన్స్‌లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్‌లతో కలిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, […]
సారథి న్యూస్, అమరావతి: ఈ నెల 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకు గతంలో వైఎస్ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం […]