Breaking News

ఖమ్మం

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, ఖమ్మం: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజాపక్షపాతిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరి రావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, సర్పంచుల సంఘం […]

Read More
రైతులకు పంటరుణాల చెక్కులు

రైతులకు పంటరుణాల చెక్కులు

సారథి న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా వైరా విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సుమారు 270 మంది రైతులకు రూ.90లక్షల విలువైన పంట రుణాల చెక్కులను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ శనివారం క్యాంపు ఆఫీసులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్​ మాట్లాడుతూ.. రైతులు స్వల్పకాలిక రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరారు. గొల్లపూడి, […]

Read More

ఆదివాసీలకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, ఖమ్మం: ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉండి, వారి హక్కులను పరిరక్షిస్తామని భారత మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్​ మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం గ్రామంలో గురువారం మానవహక్కుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గిరిజనలకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారి ఇండ్లను పరిశీలించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

మట్టిగణపతే.. మహాగణపతి

సారథిన్యూస్​, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్​ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.

Read More

గణేశ్​ మండపాలకు నో పర్మీషన్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్​ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More
వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

సారథి న్యూస్​, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్​ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్​ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ […]

Read More
ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ భరోసా మున్నేరు ముంపు పునరావాస కేంద్రాల పరిశీలన సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రవహిస్తున్న మున్నేరు కాల్వ ఒడ్డు ముంపు ప్రాంతవాసులకు నయాబజార్ స్కూలు​, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం సందర్శించారు. నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. […]

Read More
ఖమ్మంలో సిమ్యులేటర్​ ప్రారంభం

రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు

సారథి న్యూస్​, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్​ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్​ సిమ్యులేటర్​ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More