సారథి న్యూస్, వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల జీవనోపాదుల సర్వేను రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పలు పథకాలపై సమీక్షించారు. కోవిడ్ రుణాలకు సంబంధించి 5,445 సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 533 సంఘాలకు రూ.3.14 కోట్లు మాత్రమే ఇచ్చామని తెలిపారు. బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలను కలెక్టర్ సమీక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి రూ.16.8కోట్ల రుణం ఇవ్వాల్సి […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ కార్యదర్శి పోస్టులు(రెగ్యులర్, జూనియర్) తాత్కాలిక ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ నుంచి ఎంపిక చేసేందుకు ధ్రువీకరణ పత్రాలను ఈనెల 6న ఉదయం10.30 గంటలకు జిల్లా పంచాయతీ ఆఫీసులో పరిశీలిస్తామని కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఈ మేరకు మెరిట్ లిస్టును 1:3 నిష్పత్తిలో జిల్లా పంచాయతీ ఆఫీసులో నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సారథి న్యూస్ ఆదిలాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు 2018 -19 కి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా పత్తి రైతులు చెల్లించిన ప్రీమియం 66 కోట్లు కాగా రైతులకు రావాల్సిన రూ. 300 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని చారకొండ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్స్ లో ఉన్న ముగ్గురికి కరోనా టెస్టులో నెగిటీవ్ వచ్చిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పాజిటీవ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులైన వారి రక్త నమూనాలను ఆదివారం హైదరాబాద్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించగా సోమవారం వచ్చిన రిపోర్ట్ లో నెగిటివ్ గా వచ్చిందని వెల్లడించారు. ఆ ముగ్గురిని 14 […]
–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్: అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల( ఏఈవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఎస్.వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఏఈవో అవుట్ సోర్సింగ్ పోస్టులు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా వ్యవసాయ అధికారులకు పంపించామని, సంబంధిత జిల్లాలోని రోస్టర్ ప్రకారం జిల్లా […]
సారథి న్యూస్, శ్రీకాకుళం : దేశ, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్, కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మీడియాకు వివరించారు. జిల్లాకు ఇప్పటివరకు విదేశాల నుండి 13,500 మంది వరకు వచ్చారని, వారు స్వచ్ఛందంగా సెల్ నం.94912 22122, 089422 40699 లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ఢిల్లీ, ముంబై తదితర […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : కరోనా కట్టడిలో నాగర్ కర్నూల్ జిల్లాదే విజయమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రెడ్ జోన్ పరిధిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై సాయిశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి రెడ్ జోన్ ను పోలీస్, మున్సిపల్ అధికారులు పకడ్బందీగా అమలుచేశారని, అధికారుల నిర్దిష్ట ప్రణాళిక […]
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం మించిన వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈసారి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఏఈవో ఆధ్వర్యంలో ధాన్యం క్వాలిటీ చెక్ చేసి కొంటామన్నారు. కూపన్ల […]