సారథి ప్రతినిధి, రామగుండం: కరోనా విజృంభిస్తున్న వేళ గోదావరిఖనిలోని గల్లీగల్లీల్లో పోలీసులు సోమవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించారు. గాంధీచౌరస్తా నుంచి సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పనీపాట లేకుండా తిరుగుతున్న 20 మంది వాహనాలను సీజ్ చేసి, వారిని ఐసొలేషన్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారికి కౌన్సిలింగ్ చేసి కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు. పెట్రోలింగ్ లో వన్ టౌన్ 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ఉమాసాగర్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్33, భద్రాద్రి కొత్తగూడెం 95, […]
పాట్నా: కరోనా ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్లోని దనాపూర్కు చెందిన మహేశ్ కుమార్(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్– 19 (కరోనా)కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ జె.నివాస్ గురువారం పరిశీలించారు. కరోనా వ్యాధిగ్రస్తులు వచ్చే మార్గం గుండా ఇతర వ్యాధిగ్రస్తులు రాకపోకలు సాగించకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. జీజీహెచ్ లో 90 బెడ్లను ఐసోలేషన్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి కూడా ప్రత్యేక వసతి ఉండాలని, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ సరఫరా చేయాలని […]
సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ.. భర్తతో కలిసి గత నెల సూర్యాపేటలోని జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా ఆమె దగ్గుతుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె భర్తను, ఇద్దరు […]