హైదరాబాద్: ఆర్డీఎస్ కుడికాల్వతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రాంతానికి చుక్క నీటిబొట్టు కూడా రాదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను మొదలుపెట్టిన విషయమై ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను వివరించారు. ఏపీ చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌తో మాట్లాడాలని సూచించారు. దీనిపై […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాతో పాటు ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గతేడాది ఫ్లాష్ ఫ్లడ్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, సుంకేసుల, గాజులదిన్నె డ్యాములు, వెలుగోడు, గోరకల్లు, పోతిరెడ్డిపాడు, అవుకు, కృష్ణగిరి, పందికోన హంద్రీ రిజర్వాయర్లు, తుంగభద్ర, […]
అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్)పై ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచింది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం సంతకం చేశారు. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన […]
అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి కట్టుకోవాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. వ్యాధి నివారణకు కఠినచర్యలు తప్పవని స్పష్టంచేసింది.
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి అయ్యే ఖర్చులను నిర్ధారిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250 గా నిర్ధారించారు. ఎన్ఐవీతో […]
అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు కట్టడం తప్పదమే ఏపీ ప్రభుత్వతీరు విభజన చట్టానికి విరుద్ధం ‘కృష్ణా’ బోర్డులో ఫిర్యాదుచేస్తం కనీసం మమ్మల్ని సంప్రదించలేదు ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]