ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ సారథి, బిజినేపల్లి: కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను హరించివేయడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. మోడీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టాక కరోనా వైరస్ కారణంగా దేశం ప్రజలు బెంబేలెత్తిపోతున్నా ఏమీ పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల […]
సారథి, కొల్లాపూర్: కృష్ణానది నీటిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాను జయప్రదం చేయడానికి కొల్లాపూర్ నుంచి సీపీఐ నాయకులు బయలుదేరారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య మహిళా కార్యదర్శి ఇందిర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జిల్లా సమితి నాయకులు కురుమయ్య, కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి ఎండీ యూసుఫ్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు సత్యం, వెంకటాచలం, శీను, గంగన్న, హరికురుమయ్య, ఎల్లయ్య, వెంకటమ్మ, చిన్నమ్మ, కురుమయ్య, చెన్నకేశవులు, ఎం.నరసింహ, […]
సారథి, రామగుండం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఎన్టీపీసీ ప్లాంట్ గేట్నం.2 వద్ద సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. కార్మిక సంఘాల నేతలు మేరుగు రాజయ్య, ఎం.సారయ్య, మెండె శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేశ్, కారం సత్తయ్య, వంగల రామన్న, కె.కృష్ణ, సీహెచ్లక్ష్మణ్, నంది […]
సారథి న్యూస్, రామగుండం: సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం జరిగిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్నకార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మేరుగు రాజయ్య, మహేందర్ రావు, కె.కనకరాజు, బళ్లు రవి, భోగ సతీష్, భాస్కర్, అబ్దుల్ కరీం, గంగారపు […]
సారథి న్యూస్, వనపర్తి: నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు, ఏఐటీయూసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మాసన్న, పార్టీ సీనియర్ నాయకుడు డి.చంద్రయ్య పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీసులో శనివారం ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి అనుసరిస్తూ హక్కులను కాలరాస్తున్నాయని […]
సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా 35శాతం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామగుండం రీజియన్ పరిధిలోని వకీల్ పల్లె గనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్, ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి రాజరత్నం, సీపీఐ నాయకుడు జి.గోవర్ధన్, శంకర్, కిరణ్, సంపత్, వెంకటేష్, రాజు, మల్లేష్, ప్రదీప్ కార్మికులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీఎన్ జీఎం ఆఫీసు ఎదుట నిరాహారదీక్షలు చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, వి.సీతారామయ్యతో పాటు సీపీఐ నాయకులు జి గోవర్ధన్, కె.కనకరాజు దీక్షలను ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం కరోనా పేరుతో సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు తన రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాలు తీసుకొస్తే యజమాన్యం లాభాలు ప్రకటించకుండా రాష్ట్ర […]
గోదావరిఖని: సింగరేణి బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ పిలుపుమేరకు ఆర్జీ-1 లో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కేంద్రకమిటీ సెక్రటరీ మెరుగు రాజయ్య మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, ఉల్లి మొగిలి, జీ ఆనందం, పీ రవి, ఏ […]