సారథి, ఎల్బీ నగర్: కాలనీల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట, షిర్డీసాయినగర్ కాలనీల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నల్ లైన్స్, మిగతా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీరోడ్లు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: కొంతకాలంగా బకాయిలో ఉన్న జీతాలను వెంటనే చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలని శ్రీచైతన్య కాలేజీ ఎదుట అధ్యాపకులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురిలో శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్‌లో క్లాస్‌రూమ్‌లోకి వెళ్లి అధ్యాపకులు స్వీయనిర్బంధం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని బాధిత లెక్చరర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఓ వైపు భారీవర్షం.. హాస్పిటల్ లో పేషెంట్ ఆపరేషన్ కోసం మెడిసిన్ ఆపరేషన్ కిట్ అవసరం.. అవును ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నడుముల్లోతు నీటి ప్రవాహంలో వెళ్లి కమలానగర్ లోని రవీంద్ర హాస్పిటల్ లో పేషెంట్‌కు అత్యవసర మెడిసిన్ అందించారు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్అంజపల్లి నాగమల్లు. పక్కనే కరెంట్ స్థంభం ఉన్నా నీటి ప్రవాహ ఉధృతిని లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. ఆయన ధైర్యం చూసి […]
సారథి న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3) ఉన్నాడు. సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: సీఎం కేసీఆర్ ఆకాంక్ష, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్ లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించినట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం తెలిపారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివసించే లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. మొత్తం 288 ఇళ్లలో స్థానికంగానే నివసిస్తూ […]