Breaking News

ఎమ్మెల్యే మర్రి

నాగర్​ కర్నూల్​ లో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీల చించివేత

నాగర్​ కర్నూల్​ లో ‘ఎమ్మెల్సీ కవిత’ ఫ్లెక్సీల చించివేత

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్​ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఆమెకు స్వాగతం చెబుతూ నియోజవర్గవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కానీ శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను చించివేశారు. […]

Read More
ఎమ్మెల్యే మర్రికి చుక్కెదురు

ఎమ్మెల్యే మర్రికి చేదు అనుభవం

అడ్డుకున్న వట్టెం భూనిర్వాసితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చుక్కెదురైంది. వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అదనంగా లక్ష రూపాయలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచినా నేటికీ నెరవేర్చలేదని వట్టెం భూనిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని సోమవారం సాయంత్రం వట్టెం గ్రామంలో అడ్డుకున్నారు. ఆసరా పింఛన్ పంపిణీలో […]

Read More
తిమ్మాజిపేట ప్రభుత్వ ఆస్పత్రికి దిక్కెవరు?

తిమ్మాజిపేట ప్రభుత్వ ఆస్పత్రికి దిక్కెవరు?

ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్​ సౌకర్యం లేదు బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్​కర్నూల్ ​ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ ​సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 […]

Read More
ఎంత కాలం బతికామన్నది కాదు...

ఎంతకాలం బతికామన్నది కాదు…

జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం అదృష్టం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అభినందనీయం విద్యాయజ్ఞంలో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్​ సామాజిక సారథి, తిమ్మాజీపేట: జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అందులో పాఠశాలలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ స్కూలులో లేని విధంగా తిమ్మాజీపేట జెడ్పీహెచ్ఎస్​ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని, ఎంజేఆర్​ ట్రస్టును […]

Read More
బీఎస్పీ నేతలు దిగజారి మాట్లాడొద్దు

బీఎస్పీ నేతలు దిగజారి మాట్లాడొద్దు

ఎమ్మెల్యేను ఏమన్నా ఊరుకోం ప్రజల కోసం సేవచేసే వారిపై విమర్శలు సరికాదు మీడియా సమావేశంలో టీఆర్​ఎస్​ నేతలు సామాజిక సారథి తిమ్మాజిపేట: అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. అభివృద్ధిపై బీఎస్పీ నాయకులు కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఎస్పీ ఎదుగుదల కోసం దిగజారి మాట్లాడటం […]

Read More
‘రైతన్న’ బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి

‘రైతన్న’ బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం ఉదయం నాగర్​కర్నూల్​లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి తిలకించారు. రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలను మూర్తన్న చాలా బాగా ఆవిష్కరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా […]

Read More
రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాల పంపిణీ

రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాల పంపిణీ

సారథి, బిజినేపల్లి: ఆర్​ఏహెచ్​– యాక్ట్ పథకంలో భాగంగా రాయితీపై లబ్ధిదారులకు గడ్డి కత్తిరించే యంత్రాలను మంగళవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ ​గ్రామానికి చెందిన నలుగురు, లట్టుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఐదు గ్రామాలు లట్టుపల్లి, నందివడ్డేమాన్, సల్కర్ పేట, వసంతపూర్, వట్టెం గ్రామాలు ఈ పథకానికి ఎంపికైనట్లు వివరించారు. ఈ […]

Read More
బక్రీద్.. ముబారక్​

బక్రీద్.. ముబారక్​

సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్​ జిల్లాలో ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈద్గాలు, మసీద్ ల్లో ప్రత్యేక నమాజు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామామసీద్ తోపాటు అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

Read More