సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు ఉచితంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఆదివారం ఉదయం నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఆమెకు స్వాగతం చెబుతూ నియోజవర్గవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కానీ శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బిజినేపల్లి నుంచి పాలెం మధ్యలో మూడు ఫ్లెక్సీలను చించివేశారు. […]
సామాజికసారథి, వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి(చల్లపల్లి)లో మాదిగ ఐక్యవేదిక కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా సమావేశానికి మాదిగ ఐక్యవేదిక నాయకులు కొయ్యల పుల్లయ్య, గుద్దటి కిస్టాల్, కొమ్ము అంజయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మీసాల అంజయ్య మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకమై తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ […]
న్యూఢిలీ: దేశంలోని అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ ను నియమించారు ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ను సైతం కొత్త గవర్నర్ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఏపీ గవర్నర్ గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను […]