సారథి న్యూస్, వరంగల్ : ‘కరోనా లాంటి విపత్తులను అనేకం మనం ఎదుర్కొన్నాం..దీనిని ఎదుర్కొనే సత్తా మనకు ఉంది.. ప్రజలెవ్వరూ భయపడవద్దు’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో సీఎస్సార్ గార్డెన్స్ లో కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మన రాష్ట్రాన్నే కాదు కరోనా మహమ్మారి యావత్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజాతో సమీక్షించారు. మార్చిన 2న రాష్ట్రంలో కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు, వైద్యసిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేట్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల కోరారు.
సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పర్యటించారు. కాళేశ్వరం జలాలను తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తీసుకెళ్లే క్రమంలో భూములు కోల్పోతున్న రైతులకు పర్లపల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్ ఉన్నారు.
సారథి న్యూస్, రామడుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనిపించడం లేదని బుధవారం రామడుగు పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదుచేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యత కలిగిన హోదాలో ఉండి కూడా ప్రజాసమస్యలను గాలికొదిలేసి తిరుగుతున్నారని ఆరోపించారు. వరి ధాన్యం తూకాల్లో మోసాలు చేస్తున్నా ఒక్కరోజైనా మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాపానపోలేదని అన్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని […]