సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వరంగల్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలను అధికారులు నిరుపయోగంగా పడేశారని కాంగ్రెస్ నేత అక్కు శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనుల్లోని మోటర్లకు ఉపయోగించేందుకు స్విచ్చింగ్ యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయగా వాటిని అధికారులు హుస్నాబాద్‌లోని నివాసప్రాంతాల్లో ఉంచారని ఆరోపించారు. వాటిని వెంటనే వినియోగించాలని.. లేదంటే కంపెనీలకు వాపస్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని […]
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చనవారిలో పోలీస్, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.
సారథి న్యూస్, రామాయంపేట: సీఎం కేసీఆర్ సంకల్పించిన నియంత్రిత సాగు విధానానికి తాము రెడీ.. అంటూ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం, కె.వెంకటాపూర్ గ్రామస్తులు బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ మాట్లాడుతూ.. వానాకాలంలో మక్క పంటను వేయమని, అధికారుల సూచనల మేరకు పంటలను వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనిల్ కుమార్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, గ్రామస్తులు దయాకర్, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొన్నారు.