సారథి న్యూస్, మెదక్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా రాష్ట్రంలో రైతులకు రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్ కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 24 […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, మంత్రులతో శనివారం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయని, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, చాలాచోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరిందన్నారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది. కరోనాకు ముందు రాష్ట్రంలో రోజూ ఐదువేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్డౌన్ కారణంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో కాకుండా ప్రగతి భవన్ లోనే జరగనున్నాయి. ఇక్కడే సీఎం కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్ కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏటా గోల్కొండ కోటలో పంద్రాగస్టు సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 15న ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకం, కృషివల్ల తెలంగాణలో జలవిప్లవం వచ్చిందని, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతోందని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించి గైడ్ లైన్స్ రూపకల్పనకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీలివిప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతవిప్లవం (పాడి […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్టను ఇక నుంచి వనదుర్గా ప్రాజెక్టుగా వ్యవహరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న పలు పథకాలకు ప్రభుత్వం దేవుళ్ల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. నిజాం నవాబుల పాలనాకాలంలో కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ ఒక్కటిగానే పనిచేస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సంబంధితశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాలని గుర్తుచేశారు.కరోనా […]