సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో కాకుండా ప్రగతి భవన్ లోనే జరగనున్నాయి. ఇక్కడే సీఎం కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్ కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏటా గోల్కొండ కోటలో పంద్రాగస్టు సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 15న ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]