సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్రిదండి చిన్నజీయర్ స్వామిని పరామర్శించారు. చిన్నజీయర్‌స్వామి తల్లి అలివేలు మంగతాయారు(85) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో స్వామివారిని సీఎం కేసీఆర్ పలకరించి వచ్చారు.
సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీచేసేందుకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు దాదాపు ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్ దక్కడం దాదాపు ఖాయమనే […]
ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి అభివృద్ధి అత్యంత సుందరంగా ఉండేలా ఆలయ నిర్మాణపనులు పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కావునా ఎక్కడా తొందరపాటు లేకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని […]
సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్లో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో […]
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని.. కలకలం రేపిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘటన సారథి న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీకి కూతవేటు దూరం.. గురువారం మధ్యాహ్నం.. రవీంద్రభారతికి సమీపంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని కేకలు వేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకుంటున్న క్రమంలోనే ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020 ను ఆమోదించింది. ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020ను ఆమోదించింది. అలాగే తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు-2019లోని సవరణ బిల్లుకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల త్యాగం, దయే కారణం. ఎముకలు కొరికే చలి, మండుటెండలు, ఆక్సిజన్ అందని వాతావరణంలో సైతం వారు విధులు నిర్వర్తిస్తుంటారు. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు దేశానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇప్పటి వరకూ సైనికుడు లేదా అతడి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లలో ఏదో ఒకటి మాత్రమే అందుతున్నది. కానీ ఇప్పటి నుంచి తెలంగాణలో […]
దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ […]