Breaking News

రామాయంపేట

చివరి గింజ దాకా కొంటాం

చివరి గింజ దాకా కొంటాం

సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్​జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్​ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.

Read More
పుస్తెమట్టెల అందజేత

పుస్తెమట్టెల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొరలగల్ల యాదయ్య కూతురు పెళ్లికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ శుక్రవారం పుస్తెమట్టెలు అందజేశారు. కార్యక్రమంలో నార్లపూర్ ఎంపీటీసీ సభ్యుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గురుగల శ్రీనివాస్, నిజాంపేట ఉపసర్పంచ్ కొమ్మట బాబు పాల్గొన్నారు.

Read More
వడ్ల కొనుగోళ్లు షురూ

వడ్ల కొనుగోళ్లు షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, చల్మేడ గ్రామాల్లో శుక్రవారం రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు కలసి ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, […]

Read More
పంట ఎండింది.. గుండె మండింది

పంట ఎండింది.. గుండె మండింది

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, […]

Read More
ఘనంగా సద్దుల బతుకమ్మ

ఘనంగా సద్దుల బతుకమ్మ

సారథి న్యూస్, రామాయంపేట: ‘పోయి రా బతుకమ్మ పోయి రావమ్మ’ అంటూ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఊరుఊరంతా తంగేడు వనలైనవి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. గన్నేరు పువ్వొప్పునే గౌరమ్మ.. శివ శివ శివ.. ఉయ్యాల్లో.. శివుడా .. నిన్ను తలుతూ’ అడబిడ్డలు బతుకమ్మ పాటలు హోరెత్తినయ్. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు ఆడిపాడారు. పల్లెపదం పాడుతూ పాదం కలిపారు. బతుకమ్మల సంబురాలు అంబరాన్నంటాయి. లయబద్ధంగా అడుగులు వేస్తూ.. పాటలతో చప్పట్లు కొడుతూ.. భూతల్లికి […]

Read More
రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట క్లస్టర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు అందె ప్రతాప్ రెడ్డి రూ.12లక్షల చెక్కును డీడీఏవో పరుశురాం నాయక్ కు అందజేశారు. మండల రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాం, ఏవో సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్​పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించినా నయం కాకపోవడం, అలాగే తన కుటుంబసభ్యులు తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉంటూనే ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని […]

Read More