Breaking News

రామడుగు

‘రైతుబీమా’ గొప్పపథకం

సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల పాలిట గొప్పవరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన దుర్గం రములు అనే రైతు ఇటీవలే చనిపోగా అతడి కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే రైతు బీమా ప్రొసీడింగ్స్​ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్​ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ […]

Read More

ఇసుకను తరలిస్తే ఉపేక్షించం

సారథిన్యూస్, రామడుగు: ఇసుకను అక్రమంగా రవాణాచేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదన్నారు. అటువంటి వారిని ఉపేక్షించబోమన్నారు. బుధవారం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్​చేశారు.

Read More

కరెంట్​ చార్జీలు తగ్గించాలి

సారథి న్యూస్, రామడుగు: లాక్ డౌన్ నేపథ్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామడుగు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. జిట్టవేని అంజిబాబు, డబుల్ కార్ రాజు, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేంద్రాచారి, ఎడవెళ్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More

దుస్తుల పంపిణీ

సారథి న్యూస్​, రామడుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకరెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు.ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం హమాలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, పైడ్లా శ్రీను, రాగం లచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, మచ్చ గంగయ్య, కోట్ల మల్లేశం, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఉద్యమకారుడి కుటుంబానికి చేయూత

సారథి న్యూస్​, రామడుగు: ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి యువతను రాష్ట్రసాధనలో కార్మోన్యుకులుగా తీర్చిదిద్దిన పెందోట మోహనాచారి కుటుంబానికి సోమవారం టీఆర్ఎస్ నాయకులు బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. మామిడి నర్సయ్య, రాగం లచ్చయ్య, మాదం రమేష్, అబ్దుల్ అజీజ్, సలాఉద్దీన్ పాల్గొన్నారు.

Read More

ఉత్సాహంగా పల్లెప్రగతి

సారథి న్యూస్​, రామడుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతితో పాటు పాలకవర్గ సభ్యులు వివిధ వార్డులను సందర్శించి పారిశుద్ధ్యం తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో సముద్రాల శ్రీను, నీలం రవి, సుబద్ర, మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్, మామిడి కుమార్, పెందోట రాజు, మామిడి అంజయ్య పాల్గొన్నారు.

Read More

మేం చెప్పిన పంటలే వేయండి

సారథి న్యూస్​, రామడుగు: పంటల మార్పుతోనే వ్యవసాయంలో సమృద్ధిగా లాభాలు వస్తాయని కరీంనగర్​ జిల్లా రామడుగు ఏఈవో యాస్మిన్ అన్నారు. అగ్రికల్చర్​ అధికారులు సూచించిన ఎరువులు, విత్తనాలు మాత్రమే వాడాలని సూచించారు. స్థానిక ఎంపీడీవో ఆఫీసులో మంగళవారం వానాకాలం పంటసాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టిపెట్టాలన్నారు. రైతులు వానాకాలంలో వరి, పత్తితో పాటు కంది, పెసర పంటలు వేయాలన్నారు. స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్ […]

Read More

ఇంకుడు గుంత తప్పనిసరి

సారథి న్యూస్​, రామడుగు: ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మించుకోవాలని కరీంనగర్​ జిల్లా రామడుగు సర్పంచ్ సత్యప్రసన్న కోరారు. ఆదివారం గోపాల్​ రావు పేట్ మూడవ వార్డులో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.4100 ఇస్తుందన్నారు. వార్డులో 15 మంది ఇళ్ల వద్ద ఇంకుడుగుంతల తవ్వకాన్ని ప్రారంభించారు.

Read More