Breaking News

రామగుండం

ఎమ్మెల్యే.. మానవతా హృదయం

ఎమ్మెల్యే.. మానవతా హృదయం

సారథి న్యూస్, రామగుండం: మానవత్వం మంటగలుస్తున్న నేటి పరిస్థితిల్లో మానవీయతను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాథలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక చౌరస్తాలో ఓ అనాథ వృద్ధురాలిని తన వాహనంలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఉన్న ఓ వృద్దురాలిని షెల్టర్​కు తరలించి మానవీయతను చాటుకున్నారు. మంత్రి కె.తారక రామారావు […]

Read More
కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ కార్యకర్త ఎంఎన్ శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గుంటూరుపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఓదార్చారు. ఆత్మహత్యకు పాల్పడిన శివారెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మృతుని కుమార్తెకు వైద్యసదుపాయం కల్పిస్తామని భరోసా కల్పిస్తామన్నారు.

Read More

బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​

సారథి న్యూస్​, రామగుండం: బసంత్​నగర్​లో ఎయిర్ట్​పోర్టు నిర్మాణం పూర్తయితే.. రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్​పోర్టులను నిర్మిస్తున్నారని అందులో బసంత్​నగర్​ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వాల్వ అనసూయ, సర్పంచ్ కొల లత, ఎంపీటీసీ దుర్గం […]

Read More
ఎమ్మెల్యే కోరుకంటి పల్లెనిద్ర

ఎమ్మెల్యే కోరుకంటి పల్లెనిద్ర

సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర చేపట్టారు. అక్కడే బసచేసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.

Read More
సింగరేణిలో కరోనా కలకలం

సింగరేణిలో కరోనా కలకలం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొంతమంది కరోనా పేషేంట్లు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పాజిటివ్​ వచ్చినవారి వివరాలు వెల్లడించకపోవడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్​ వచ్చినవారు క్వారంటైన్​లో ఉండేలా సింగరేణి యాజమాన్యం, వైద్యులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read More

పేదయువతి వివాహానికి ఆర్థికసాయం

సారథిన్యూస్​, రామగుండం: ఎన్టీపీసీకి చెందిన ఓ పేదయువతి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ఆసరాగా నిలిచింది. పెదపల్లి జిల్లా రామగుండం పరిధిలోని న్యూమారేడుపాకలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మేఘన అనే యువతికి వివాహం జరిగింది. మేఘన తల్లిదండ్రులు పేదరికంలో ఉండటంతో విషయం తెలుసుకున్న రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్.. పేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మనిదీప్ ను అదేశించారు. దీంతో విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదీప్ యువతికి […]

Read More
నారాయణకు ఘన నివాళి

నారాయణకు ఘన నివాళి

సారథి న్యూస్​, రామగుండం: సీపీఐ నేత ఎం.నారాయణ.. నిజాయితీకి మారుపేరు అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కొనియాడారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని భాస్కర్​రావుభవన్​లో ఎం.నారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు వారు హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్​, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, యూనియన్ […]

Read More

మతోన్మాద శక్తులను అడ్డుకుందాం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్​ఎఫ్​) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్​ఎఫ్​ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్​ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్​ పాల్గొన్నారు.

Read More