Breaking News

మెదక్

రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు

రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు

సారథి న్యూస్ నర్సాపూర్: రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ఆర్ తో పాటు కౌడిపల్లి లో రైతు వేదికల స్థలాలను పరిశీలించారు. రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలన్నారు. నియంత్రిత సాగు విధానాన్ని ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో 55.7లక్షల […]

Read More
హరితహారం సక్సెస్​ కావాలి

హరితహారం సక్సెస్​ కావాలి

సారథి న్యూస్, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ జనరల్​బాడీ సమావేశం జిల్లా కలెక్టరేట్ లో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో హరితహారం విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను నాటి ట్రీ గార్డులను తప్పనిసరిగా ఏర్పాటు […]

Read More
మెదక్​జిల్లాను నం.1గా నిలుపుదాం

మెదక్ ​జిల్లాను నం.1గా నిలుపుదాం

సారథి న్యూస్, మెదక్: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మెదక్ జిల్లాను ముందంజలో నిలపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. అందుకోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణాల్లో తడి, పొడి చెత్తపై […]

Read More
ఊరూరా మొక్కలు నాటుదాం

ఊరూరా మొక్కలు నాటుదాం

సారథి న్యూస్, మెదక్: రాష్ట్రంలో పచ్చదనం పెంచి భావితరాలకు బంగారు భవిష్యత్​ను అందించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం పాతూరు, సుల్తాన్ పూర్ గ్రామాలతో పాటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయం, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో […]

Read More
ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు

ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని మెదక్ అడిషనల్​కలెక్టర్ నగేష్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రూరల్ డెవలప్​మెంట్​కమిషనర్ రఘునందన్ రావు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్​ నుంచి అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ప్రకృతి వనాలను నిర్మించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒక ఎకరాకు తగ్గకుండా స్థల సేకరణ జరిపి వాటిని చదును చేసి వాటిలో ఎరువులు వేసి నేలను […]

Read More

అర్బన్​ పార్క్​.. సిటీ మార్క్​

నర్సాపూర్​ పార్క్​ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, మెదక్: గెజిబోలు, వాచ్‌‌ టవర్‌‌లు, వాకింగ్‌‌, సైకిల్‌‌ ట్రాక్‌‌లు, ట్రెక్కింగ్ సౌకర్యాలు… ఇవన్నీ ఎక్కడో మెయిన్‌‌ సిటీలో ఉండే పెద్ద పెద్ద పార్కు‌లు, రిసార్ట్స్​లో ఉండే సౌకర్యాలు అనుకుంటున్నారు కదూ! నిజమే కానీ అది ఇదివరకటి మాట. ఇప్పుడు జిల్లాలో సైతం ఇలాంటి పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌‌ ఫారెస్ట్‌‌లో అన్ని హంగులతో అర్బన్‌‌ పార్క్‌‌ రెడీ అయింది..కాలానుగుణంగా ప్రజల జీవనశైలి మారుతోంది. తీరిక […]

Read More

హరితహారానికి రెడీ కండి

సారథి న్యూస్​, మెదక్​: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ […]

Read More
షార్ట్ న్యూస్

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]

Read More