Breaking News

మెదక్

జనరల్​బాడీ మీటింగ్.. గరం గరం

జనరల్​బాడీ మీటింగ్.. సభ్యుల గరంగరం

సారథి న్యూస్, కౌడిపల్లి: మెదక్ ​జిల్లా కౌడిపల్లి మండల జనరల్​బాడీ మీటింగ్ ​వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ అజహరుద్దీన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యురాలు కవితా అమర్ సింగ్, ఎంపీపీ రాజునాయక్ మాట్లాడుతూ.. మండలంలో ప్రతి డిపార్ట్​మెంట్ ​వారు సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని, దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉపాధి హామీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం […]

Read More
ఉదారత చాటిన స్నేహబంధం

ఉదారత చాటిన స్నేహబంధం

సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. […]

Read More
కరెంట్​లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

కరెంట్​ లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్​1 నుంచి ఆన్​లైన్ ​క్లాసెస్ ​చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్​ లేకపోవడం పెద్ద సవాల్​గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ ​కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి […]

Read More
ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు

ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు

దోపిడే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది ఉత్సవ విగ్రహంలా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల సీఎల్పీ లీడర్​ మల్లు భట్టి విక్రమార్క ధ్వజం సారథి న్యూస్, మెదక్: సీఎం కె.చంద్రశేఖర్​రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి దోపిడే ధ్యేయంగా పనిచేస్తోందని సీఎల్పీ లీడర్​మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్​ప్రభుత్వాసుపత్రిని సందర్శించి కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విపత్తు సమయంలో సర్వ […]

Read More
మట్టివినాయకులను పూజిద్దాం

మట్టి వినాయకులను పూజిద్దాం

సారథి న్యూస్, మెదక్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, ఇళ్లు, మండపాల వద్ద మట్టితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను శుక్రవారం మెదక్ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ చంద్రపాల్ తో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి […]

Read More
కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

సారథి న్యూస్, మెదక్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా రాష్ట్రంలో రైతులకు రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్ కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 24 […]

Read More
‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి

‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రైతువేదిక పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్​నగేష్ కాంట్రాక్టర్లకు సూచించారు. శనివారం నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదికలను నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగాలని, నాణ్యతగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఏవో పరశురాంనాయక్, ఏవో సతీశ్​ ఉన్నారు.

Read More
‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

‘ఇంటింటా ఇన్నోవేటివ్’​కు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్​లైన్​లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.

Read More