3146 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు సామాజికసారథి, హైదరాబాద్: మహానగరం హైదరాబాద్ లో డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. మందేసిచిందేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే బయటకు తాగి వచ్చిన వారిని పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో బుక్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయయి. నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3146 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ […]
సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు […]
న్యూజిలాండ్: హోం క్వారంటైన్లో ఉన్న ఓ కరోనా రోగి మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సాహసమే చేశాడు. ఇనుపకంచెను తెగ్గొట్టి దాని దాటుకుంటూ వెళ్లి మద్యం కోనుగోలు చేశాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకున్నది. న్యూజిలాండ్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి(52) కి ఇటీవల కరోనా సోకగా.. అక్కడి ప్రభుత్వమే అతడిని హోంక్వారంటైన్లో ఉంచింది. క్వారంటైన్ కేంద్రం చుట్టూ భారీ ఇనుపకంచెలు కూడా ఏర్పాటు చేశారు. కాగా అందులో ఉంటున్న ఓ కరోనా రోగి మందు తాగాలనిపించంది. […]
నాగ్‌పూర్: మద్యం దొరకలేదని శానిటైజర్ తాగిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన గౌతమ్ గోస్వామి (45) స్థానిక మున్సిపాలిటీలో క్లీనింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం దొరకపోవడంతో శానిటైజర్ తాగితే కిక్కు వస్తుందని భావించిన గోస్వామి తన ఇంట్లో ఉన్న శానిటైజర్‌ను తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యలు చికిత్సచేసి పంపించారు. రెండ్రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.
సారథి న్యూస్, మెదక్: సాధారణంగా ఎక్కడైన దొంగలు దొంగతనం చేస్తారు. కానీ విచిత్రంగాఓనర్ లే వైన్స్ కు కన్నం వేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా గౌరారం లోని వైన్స్ కు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. కొన్ని రోజులుగా దొంగతనాలు […]