సారథి, రామడుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, మచ్చలేని మంచి మనిషి ముదిరాజ్ ల ఆరాధ్యదైవం అని కొనియాడారు. […]
సారథి, చొప్పదండి: కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో జనం హడలిపోతున్నారు. కరీంనగర్జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టుల కోసం జనం తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి మొదలు కుని మధ్యాహ్నం వరకు ఎండలోనే ఉండి టెస్టులు చేయించుకోని పోతున్నారు. శుక్రవారం ఇలా కొంతమంది తమ చెప్పులు, ఇంకొంతమంది ఆధార్‌కార్డులను క్యూ లైన్ఉంచి మరీ పరీక్షలు చేయించుకుంటున్నారు. చివరికి కిట్లు లేవని వైద్యసిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిట్ల సంఖ్య పెంచాలని […]
సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా డీఆర్డీఏ విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, డీఆర్డీఏ జిల్లా ఎస్బీఎం కన్సల్టెంట్ జి.చిరంజీవి శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, సానిటరీ వర్క్, పరిశుభ్రత, నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇనుముల రమేష్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేణి వేణు, […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్టార్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడి గైని తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా అహ్మద్, ఉపాధ్యక్షుడిగా మాడిశెట్టి సంతోష్, బాసవేని సాగర్, కోశాధికారిగా షాదుల్లా, కార్యదర్శలుగా శ్రీను, శ్రీధర్, శంకర్, శ్రీనివాస్, లక్ష్మీపతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీను, అస్రత్, జబిఉల్లాఖాన్, బి.శ్రీను, ఓదేలు, తిరుపతి, ప్రదీప్, రమేష్, సింహచారి, అబ్దుల్లా, పోచమల్లు, లక్ష్మణాచారి, వేణు, రాజు, డి.వేణు, ప్రధాన సలహాదారుగా రాగం […]
సారథి, రామడుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల కచ్చురం లాగా సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సూచించారు. 45 ఏండ్లు నిండిన వారంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత అధ్యక్షతన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైసర్లు వాడేలా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో […]
సారథి, రామడుగు: రామడుగు జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న 1990-1991 పదవ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గోపాల్ రావుపేట ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవేల్లి నరేందర్ రెడ్డి, గోలిరామయ్యపల్లి […]
సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీవర్షాలతో రైతులు అల్లాడుతుంటే జిల్లాకు చెందిన సివిల్ సప్లయీస్ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్ ప్రశించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరల పంపిణీపై ఉన్న శ్రద్ధ అకాలవర్షంతో అల్లాడుతున్న రైతులపై లేదన్నారు. కనీసం రైతులకు భరోసా కల్పించే సమయం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను […]
సారథి న్యూస్, రామడుగు: దేశంలో రోజు రోజుకు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్ ద్వారా జిల్లా కలెక్టర్ కు పంపిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. దళితులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణాలను మంజూరు చేయాలని కోరారు.